
కరోనా విలయతాండవానికి ప్రపంచం మొత్తం వణికిపోయింది. కొన్ని దేశాలని కకావికలం చేసింది. దీనికి మందు లేదు, చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేశారు, కాగా అది పని చేస్తుందో అనే మీమాంస లో వుండే వారు. వ్యాక్సిన్ పని చేస్తూ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎవరు వైరస్ కి మందు కనిపెట్టక ముందు మన తెలుగు వ్యక్తి ఆనందయ్య మందు ని కనిపెట్టి చాలా మందిని కాపాడాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనా మందు తయారు చేస్తూ ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు తన పేరిట నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనందయ్య తన పేరు వాడుకొని కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆయన అన్నారు. ఈ నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాను తయారు చేసిన కరోనా మందు ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ చేరిందని ఆయన చెప్పారు. దాని పంపిణీకి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.