
మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరికీ తెలియజేయకూడదు. మీ ఆర్థిక వ్యవహారాలు ఎవరికీ చెప్పకూడదు. అలా మనకి తెలియకుండా చేస్తే మీ బ్యాంకు దాచుకున్న అమౌంట్ మాయం అవుతుంది. జాగ్రత్త !!మీ ఆధార్ నెంబర్ ఎవరికీ అయినా తెలిసినట్లైతే వెంటనే జాగ్రత్త పడండి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ కావడం వల్ల ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేస్తారా? అని చాలా మందికి డౌట్ రావొచ్చు. ఈ అంశంపై ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) స్పష్టత ఇచ్చింది. ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయడం వీలు కాదని తెలిపింది. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరని పేర్కొంది. అయితే ఓటీపీ, పిన్ నెంబర్, పాస్వర్డ్ వంటివి ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలి యూఐడీఏఐ తెలిపింది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చని హెచ్చరించింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.