
మామూలుగా ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అంటారు. స్త్రీలకు ఏదైనా ఒక విషయం కనుక తెలిసింది అంటే ఆ విషయాన్ని ఎప్పుడేప్పుడూ పక్క వాళ్లతో చెప్పేద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే వాళ్లకు తెలిసిన విషయం ఏదైనా సరే అవసరం ఉన్నా లేకున్నా పక్క వాళ్ళకి కచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పకపోతే గనక వాళ్ళు సంతోషంగా ఉండలేరు. అసలు స్త్రీలు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి అంటే వారికి గల శాపం. అవునండి మీరు వింటున్నది నిజమే. పాపం నిజంగానే ఆడవాళ్ళు వారికి ఉన్న శాపం వల్లనే కానీ తమలో దాచుకోలేకపోతారట. అసలు విషయం ఏంటో చూసేద్దామా.
స్త్రీలకు రహస్యము దాచిపెట్టి అటువంటి శక్తి లేకుండా పోవడానికి కారణం క్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు శపించడమే. అసలు శపించడానికి గల కారణం ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వీరులకు కర్మకాండలు నిర్వహిస్తున్న సమయంలో కర్ణుడికి కర్మకాండలు చేయమని అందుకు కారణం అతడు తన పుత్రుడు అని కుంతి చెప్పగా తన అన్నను చంపుకుని బాధతో తల్లి ఇంత వరకు ఆ రహస్యాన్ని దాచినందుకు తల్లి చేసిన పనికి ” స్త్రీలకు రహస్యము దాచుకున్నట్టు శక్తి లేకుండాగాక” అని శపించాడు. ఈ శాపం కారణంగానే పాపం ఆడవారు తమ లో ఎలాంటి రహస్యాల్ని దాచుకోలేరు. కనీసం ఎవరో ఒక్కరికైనా కచ్చితంగా చెప్పి తీరుతారు.