
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వస్తోన్న తాజా మల్టి స్టారర్ అయిన మళయాలి రీమేక్ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతోన్నట్టు తెలిపారు.
Power Storm is all set to takeover with the Title & First Glimpse on 15th Aug from 09:45AM⚡
Get ready for the adrenaline rush ??#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/SaqwNROqV7
— Sithara Entertainments (@SitharaEnts) August 13, 2021
ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఈ మూవీకి టైటిల్‌ను ప్రకటించబోతోన్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక రవి కే చంద్రన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.