
నాలుగు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు ప్రధాని ఐదు దిగ్గజ కంపెనీలు – క్వాల్ కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్ స్టోన్ సీఈవోలతో చర్చలు నిర్వహించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జపాన్ ప్రధాని యొషిహిదే సుగాతో మోదీ భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తో వాషింగ్టన్ డీసీలో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మైత్రీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని పేర్కొంది.
India is very important partner to the US, says Kamala Harris after meeting PM Modi
Read @ANI Story | https://t.co/wB4scpxXgd#PMModiUSVisit #PMModi #KamalaHarris pic.twitter.com/TYQmnQj5hM
— ANI Digital (@ani_digital) September 23, 2021
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. భేటీపై ఇరు దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోని ఎంతో మందికి కమలా హారిస్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని మోదీ పేర్కొన్నారు. భారత్ ను సందర్శించాలని కమలను కోరారు. “భారత్, అమెరికా సహజ భాగస్వామ్య దేశాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నేతృత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయి…” ప్రధాని మోదీ పేర్కొన్నారు.