
ధనుష్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’, ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తెలుగులోకి ‘నారప్ప’ గా తీసుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ, ప్రముఖ ఓటిటి సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
కథ పరంగా ఇదొక ఎమోషనల్ యాక్షన్ డ్రామ. కులాల ప్రస్తావన వల్ల, మరియు చిన్నపాటి ఆవేశాల వల్ల ఒక కుటుంబంలో ఎంత దారుణం జరుగుతుందో చూపించిన సినిమా. నారప్పగా మాస్ నటనతో వెంకటేష్ అద్భుతంగా నటించారు. మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో, నారప్ప తన చిన్న కొడుకుని కాపాడే సీక్వెన్స్ లో, మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నటన చాల బాగుంది. ఇక నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం, భార్యగా ప్రియమణి, అలాగే మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాజర్, రావురమేష్, రాజీవ్ కనకాల వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి నాయ్యం చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ బాగుంది. వెంకటేష్ నారప్ప పాత్రను ఎలివేట్ చేసిన విధానం, అలాగే నటీనటుల నుండి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు. అలాగే మణిశర్మ అందించిన నేపథ్యం సినిమాకే హైలెట్. ఈ చిత్రం ద్వారా విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో హిట్ పడిందనే చెప్పాలి.