
శ్రీ విష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మేఘ ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘‘లాక్ డౌన్ లో ఈ కథ విన్నా. కొత్త దర్శకుడు హితేశ్ స్క్రిప్ట్ వినిపించినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఇప్పటివరకు ఇలాంటి కథను వినలేదు. అలాంటి పాత్రను పోషించలేదు. సంజన అనే యువతి పాత్రలో నేను కనిపిస్తా. ఇష్టమైన దాని కోసం ఎంతైనా కష్టపడే అమ్మాయి పాత్ర. ఈ సినిమా కథ హీరో చుట్టూనో లేక హీరోయిన్ చుట్టూనో తిరగదు. కథలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యముంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రలోనూ ఓ కామిక్ టచ్ ఉంటుంది. శ్రీవిష్టు అంత సైలెంట్ పర్సన్ ని నేనెప్పుడూ చూడలేదు. చాలా సిగ్గరి. నేనూ అంతే. అయితే, శ్రీవిష్ణును చూశాక నేనే చాలా బెటర్ అనిపించింది..’ అని మేఘ చెప్పింది. కాగా, హీరోయిన్ మేఘ ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ‘డియర్ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘మను చరిత్ర’ చిత్రాల్లో నటిస్తోంది.