
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ కంపెనీ asus కొత్తగా క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ మోడళ్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆసుస్ కంపెనీ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 పలు రకాల ల్యాప్‌టాప్ మోడళ్లను ఇండియా లో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభించింది. ఈ ల్యాప్‌టాప్ మోడళ్లు గూగుల్‌కు చెందిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ (google chrome os) పనిచేయనున్నాయి. Asus chrome booksని చదువుకునే విద్యార్థులు , వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయ్స్ ను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అసూస్ మొదటిసారిగా భారత దేశ మార్కెట్లోకి ఈ మోడళ్లను ప్రవేశపెట్టింది. అంతకుముందే యుఎస్, ఇతర దేశాలలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే, మన మార్కెట్లో కి వచ్చాయి. ఈ మోడళ్లలో కొన్నిమోడళ్ళు టచ్ డిస్ప్లే తో ,మరికొన్ని నాన్ టచ్ డిస్ప్లే తో డిజైన్ చేసారు. క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523 టచ్, నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ జూలై 22 నుండి ల్యాప్‌టాప్ క్రోమ్ బుక్ మోడళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి.